03-05-2025 12:00:00 AM
మునిపల్లి, మే 2 :మండల కేంద్రమైన మునిపల్లి గ్రామ శివారులో మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ లీక్ కావడంతో నీరంతా సమీప పొలాల్లోకి వృధాగా పారింది. దీంతో ఆ ప్రాంతమంతా వరద నీరులా పారింది. అయితే ఈ ప్రాంతం గుండా వెళ్లే ప్రయాణీకులు ఎవరు కూడా పట్టించుకోక పోవడంతో నీరంతా వృద్ధా పోయింది. ఇప్పటికైనా మిషన్ భగీరథ పైపు లీక్ అయి నీరు వృధా కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలుకోరుతున్నారు.