29-12-2025 08:59:32 PM
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన జప్తి జానకంపల్లి సర్పంచ్ వర్షిని పరమేశ్వర్ పది మంది వార్డు మెంబర్లు, వివిధ గ్రామాల పద్మశాలి సంఘం ఉపసర్పంచ్లకు కామారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు సిరిగంద లక్ష్మి నర్సింలు, జనరల్ సెక్రెటరీ బొమ్మిడి రాజయ్య ఆధ్వర్యంలో ఘనంగా శాలువలతో సన్మానించి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ గ్రామ అభివృద్ధికి పాటుపడి గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీర్చిదిద్దాలని కుల మతాలకు అతీతంగా మంచి పనులు చేపట్టి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ అధ్యక్షులు దేవసాని పోశెట్టి, మండల అధ్యక్షులు మల్లేశం, జనరల్ సెక్రెటరీ మంత్రి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.