13-08-2025 12:12:23 AM
సుప్రీం తీర్పును తప్పుబట్టిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ
న్యూఢిల్లీ, ఆగస్టు 12: దేశ రాజధాని ఢిల్లీలో వీధికుక్కలు విపరీతంగా పెరిగాయి. మనషులపై దాడులకు పాల్పడుతున్నాయి. ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకున్న దేశ అత్యున్నత న్యాయస్థానం ఢిల్లీ ప్రాంతం నుంచి వీధి కుక్కలను తొల గించాలని, జంతు ప్రేమికులు అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పంటూ తీర్పునిచ్చింది. తాజాగా ఈ అంశంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ప్రతిస్పందించారు.
‘రోజురోజుకు మనం సైన్స్, మానవత్వం లేని ప్రాచీన యుగంలోకి వెళ్లిపోతున్నట్టుగా ఉంది. మూగజీవాలైన కుక్కలు సమాజంలో పెద్ద సమస్య కాదని.. వాటిని పూర్తిగా నిర్మూలించడం సరైన చర్య కాదని అభిప్రాయపడ్డారు. కుక్కల నుంచి ప్రజలకు భద్రత కల్పించాలం టే వాటికి స్థానికంగా షెల్టర్ల ఏర్పాటు, స్టెరిలైజేషన్, టీకాలు వేయడం వంటి చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.