13-08-2025 12:15:40 AM
న్యూఢిల్లీ, ఆగస్టు 12: ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన ఘటనలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయనపై అభిశంసన తీర్మానాన్ని లోకసభ స్పీకర్ ఓం బిర్లా స్వీకరించారు. ఘటనపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్, మద్రాస్ హైకోర్టు సీజే జస్టిస్ మణీందర్ మోహన్, సీనియర్ న్యాయవాది బీవీ ఆచార్యులు సభ్యులుగా ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.
146 మంది సంతకాలు చేసిన అభిశంసన తీర్మానాన్ని స్పీకర్ ఓం బిర్లా స్వీకరించారు. ఈ సందర్భంగా ఓం బిర్లా మాట్లాడుతూ.. కమిటీ వీలైనంత త్వరగా నివేదికను సమర్పించాలని పేర్కొన్నారు. అవి నీతి వ్యతిరేక పోరాటంలో పార్లమెంట్ ఐక్యంగా ఉంటుందని స్పష్టం చేశారు. కాగా స్పీకర్ ఏర్పాటు చేసిన కమిటీకి ఘటనకు సంబంధించిన సాక్షులను పిలిపించే ప్రశ్నిం చే అధికారం ఉంటుంది.
నివేదికను తొలుత స్పీకర్‌కు సమర్పిస్తారు. ఆ తర్వాత సభలో ప్రవేశపెట్టి దానిపై ఓటింగ్ నిర్వహిస్తారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటి ఆవరణలో కాలిపోయిన నోట్ల కట్టలు లభించాయి. మంటలను ఆర్పేందుకు వచ్చిన సి బ్బంది వాటిని గుర్తించారు. దీంతో భం డారం బయటపడింది.