13-08-2025 12:08:27 AM
న్యూఢిల్లీ, ఆగస్టు 12: పహల్గాంలో పాక్ ఉగ్రదాడుల నేపథ్యంలో భారత్.. పాకిస్థాన్‌కు సింధూ జలాలను నిలిపివేసింది. భా రత నిర్ణయంపై ఓ వైపు పాక్ ఆర్మీ చీఫ్ ము నీర్, మాజీ మంత్రి బిలావల్ భుట్టో బెదిరింపులకు పాల్పడుతుండగా.. ఇంకోవైపు తమ కు నీటిని విడుదల చేయాలని ఆ దేశ విదేశాంగ శాఖ భారత్‌ను వేడుకుంటోంది. పహ ల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్‌కు నిలిపేసిన సింధూ జలాలను పునరుద్ధరించాలం టూ పాక్ విదేశాంగ శాఖ తాజాగి న్యూఢిల్లీని అభ్యర్థించింది.
మరోవైపు పాక్ ఆర్మీ చీఫ్ అ సీం మునీర్ భారత్‌పై అణుదాడులకు పాల్పడతామంటూ నోరుపారేసుకుంటున్నా రు. తాజాగా అతడు చేసిన ప్రసంగంలో ‘భారత్.. హైవేపై వస్తున్న ఓ మెర్సిడైస్ కారు లాంటిది.. కానీ పాకిస్థాన్ మాత్రం కంకరతో నిండిన ఓ డంప్ లారీ. ఒకేవేళ కారు వచ్చి లారీని ఢీకొంటే నష్టం ఎవరికి?’ అని పేర్కొన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలు వడ్డాయి.
పాక్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి బిలావల్ భుట్టో సైతం భారత్‌పై ప్రేలాపనలు పేలారు. సింధూ జలాల ఒప్పందాన్ని శాశ్వతంగా నిలిపేస్తే యుద్ధం గురించి ఆలోచించడం తప్ప తమకు మరో మార్గం లేదని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తమకు నీ ళ్లు విడుదల చేయాలంటూ భారత్‌ను పాక్ విదేశాంగ శాఖ అభ్యర్థించడం ప్రాధన్యాన్ని సంతరించుకుంది.