23 May, 2026 | 12:54 AM

రహదారిపైన ధాన్యం లోడింగ్.. వెనక్కు పోయిన బస్సు

23-05-2026 12:00 AM

సుల్తానాబాద్, మే 22 (విజయ క్రాంతి): రహదారి పైన లారీలు నిలుపుతూ ధాన్యం లోడింగ్ చేయటం కారణంగా గత రెండు రోజులుగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని తొగర్రాయి గ్రామం వద్ద రోడ్డుపై లారీ పెట్టి ధాన్యం లోడ్ చేస్తున్నా కారణంగా, మంచరామి గ్రామానికి వెళ్లాల్సిన బస్సు వెళ్లలేదు, రోడ్డుపై ఉన్న లారీ పక్కకు జరుపకపోవడంతో కొంతసేపు బస్సు ఆగి ఉండి, రిటను వెళ్లవలసి వచ్చింది, దీంతో మంచిరామి గ్రామానికి చెందిన ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు,

రోడ్డు పక్కన లారీ నిలుపుకొని ధాన్యం లోడ్ చేసుకోవాల్సి ఉండగా రోడ్డుపై నిలపడం కారణంగా బస్సు రివర్స్ పోవటం వలన మంచరామి నుండి తాము సుల్తానాబాద్, కరీంనగర్ కు వెళ్లలేకపోయామని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నిరసన తెలిపారు, ఏదైనా దాన్యం లోడింగ్ చేస్తే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, తమ గ్రామం కు వచ్చే బస్సు రాకుండా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మంచిరామి గ్రామస్తులు మండిపడ్డారు,

ఇటీవలనే సర్పంచ్ ఉప్పు లక్ష్మీ తిరుపతి మా గ్రామానికి బస్సు రావడానికి ఎంతో కృషి చేసి ఏర్పాటు చేయగా, రోడ్డుపై లారీ నిలిపి ఇలా ఆటంకం ఏర్పడడంతో తాము ఇబ్బందులకు గురికావాల్సి వచ్చిందని ప్రయాణికులు తెలిపారు, బస్సులకు, వాహనదారులకు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా రోడ్డును క్లియర్ గా ఉంచాలని, మంచరామి గ్రామస్తులు కోరుతున్నారు,