calender_icon.png 5 October, 2025 | 9:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో దుర్గామాత శోభాయాత్ర

05-10-2025 07:55:06 PM

కోదాడ: కోదాడ పట్టణం ఉత్తమ్ పద్మావతినగర్ లో హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో దుర్గామాత శోభాయాత్రను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రూపాలతో దేవుళ్ళ వేషధారణలతో శోభ యాత్రను ప్రారంభించారు. హనుమాన్ యూత్ అధ్యక్షులు ప్రముఖ బిల్డర్ కొండా రాంబాబు మాట్లాడుతూ... గత మూడు సంవత్సరాల నుంచి, దుర్గామాత శరన్నవరాత్రులను నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు. ఉత్తమ్ పద్మావతి నగర్ నుంచి రంగా థియేటర్ చౌరస్తా వరకు దుర్గామాత శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. మా యూత్ కి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, సీతారాములు, ప్రసన్నకుమార్, సతీష్, అంజి, వీరేందర్, గోవింధ్ తదితరులు కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.