calender_icon.png 5 October, 2025 | 10:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీటిలో మునుగుతున్న బాలుడిని కాపాడబోయి మహిళ మృతి

05-10-2025 07:58:52 PM

బాలుడు సేఫ్..

నల్గొండ క్రైం: కాలువ నీటిలో మునుగుతున్న బాలుడిని కాపాడబోయిన మహిళ ఆదివారం మృతి చెందింది. నల్గొండ మండలం కతాల్ గూడ కి చెందిన పగడాల అంజలి(28) ఆమె సోదరి ముగ్గురు పిల్లలు ఇతరులతో కలిసి కొత్తపల్లి గ్రామ శివారులో ఢీ37 కాలువలో బట్టలు ఉతికేసిన అనంతరం ఈత కొడుతుండగా, అదే గ్రామస్థుడు జిల్లేపల్లి దీక్షిత్ అలియాస్ చిన్ను నీటిలో మునిగిపోతుండగా అతనిని రక్షించే క్రమంలో బాలుడు దీక్షిత్ అంజలిని బిగ్గరగా పట్టుకోవడంతో ఇద్దరు నీటిలో మునిగి కొట్టుకుపోతుండగా గమనించిన నారబోయిన రామకృష్ణ దీక్షిత్ నీ రక్షించాడు. అంజలి నీటిలో కొట్టుకుపోయి చనిపోయింది. మృతురాలు భర్త కిరణ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాట్లు నల్గొండ రూరల్ ఎస్ఐ సైదా బాబు తెలిపారు.