04-10-2025 08:04:00 PM
మందమర్రి,(విజయక్రాంతి): పట్టణంలోని దుబ్బగూడెం శ్రీశ్రీశ్రీ దుర్గా భవాని సేవ మండలి ఆధ్వర్యంలో దుర్గా దేవి నవరాత్రి పూజా మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజు అయిన శనివారం అమ్మవారి నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు మంగళ హారతులతో, చిన్నారుల నృత్యాలు, కేరింతల నడుమ నిమజ్జన శోభాయాత్ర కన్నుల పండుగగా సాగింది. అనంతరం అమ్మవారిని మంచిర్యాల గోదావరి నదిలో నిమజ్జనానికి తరలించారు