04-10-2025 09:34:26 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలో శ్రీ దుర్గ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా స్థానిక వర్థకసంఘం భవనంలో దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్టించి నవరాత్రులు ఊరువాడ చల్లగా ఉండాలని నవ అవతారాలతో పూజలు నిర్వహించారు. అమ్మవారి మహా ప్రసాదం (లడ్డు) వేలం పాట నిర్వహించగా రావూరి ప్రశాంత్, ఎడ్ల రాజశేఖర్, ఎడ్ల రాజు, పువ్వాల రాజకుమారీ 20 వేల రూపాయలకు సొంతం చేసుకున్నారు. అమ్మవారి మహాలడ్డు ప్రసాదం సొంతంచేసుకోవడం చక్కటి వరంగా భావిస్తున్నట్టు వారు తెలిపారు. శనివారం నిర్వహించిన అమ్మవారి నిమంజన కార్యక్రమంలో జై శివదుర్గ భవాని కమిటీ సభ్యులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.