04-10-2025 08:07:27 PM
పదవ తరగతి మిత్రులు
ముస్తాబాద్ (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామం ప్రభుత్వ పాఠశాలలో చదివిన 2000-02 సంవత్సరానికి సంబంధించిన పదోవ తరగతి మిత్రులంతా తమ తోటి మిత్రుడు కట్ట మహేందర్ కు ఆర్థికసాయం అందించారు. అతని మిత్రులు తెలిపిన వివరాల ప్రకారం మహేందర్ కొన్ని రోజుల క్రితం బైక్ పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి గాయాలయ్యాయి. వైద్య ఖర్చులకు ఆర్థిక ఇబ్బందులు కాగా ఈ విషయం తెలిసిన వెంటనే తోటి మిత్రులు అందరు కలిసి 20 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ధైర్యంగా ఉండాలని, మేము అండగా ఉంటామని భరోసా కల్పించారు. మా మిత్రులలో ఎవరికీ ఈ ఇబ్బంది కల్గినా అండగా ఉంటామని తెలిపారు. మనమంతా ఎవరికి ఎలాంటి ఆపద ఉన్నా ముందుండి ఒకరికి ఒకరం తోడుగా ఉండాలని పేర్కొన్నారు. మహేందర్ కుటుంబ సభ్యులు వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో బాలకిషన్, శ్రీకాంత్, శంకర్ బాబు, భాను, నవీన్, బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.