04-10-2025 09:24:14 PM
ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదివాసీ ముద్దు బిడ్డ కొమరం భీం 85వ వర్ధంతిని ఈ నెల 7న జోడేఘాట్ లో నిర్వహించడం జరుగుతుందని దీనికి ప్రజలు పెద్దఎత్తున తరలిరావలని మాజీ ఎంపీ, రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపూరావు పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ లో శనివారం కొమురం భీం మనవడు కొమురం సోనేరావు తో కాలిసి కొమరం భీం వర్ధంతి గిరిజన ఉత్సవాల పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. వర్ధంతి సందర్భంగా జోడేఘాట్ లో భారీ ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క ఆదివాసీ బిడ్డ హాజరై విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు సెద్మకి ఆనంద్ రావు, తదితరులు ఉన్నారు.