24-12-2025 09:00:16 PM
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ద్యావనపల్లి బాలనర్సవ్వ దినకర్మ కార్యక్రమం ఈ రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ కాలనీ గ్రామ సర్పంచ్ గడ్డం రచన – మధుకర్ (చోటు) మానవతా దృక్పథంతో బాల నర్సవ్వ కుటుంబానికి 25 కిలోల బియ్యం అందజేశారు. కష్ట సమయంలో కుటుంబానికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సర్పంచ్ తెలిపారు.