12-07-2025 12:00:00 AM
రిక్టర్ స్కేల్‌పై 3.7 తీవ్రత
న్యూఢిల్లీ, జూలై 11: రాజధాని న్యూఢిల్లీలో శుక్రవారం సాయంత్రం రిక్టర్ స్కేల్‌పై 3.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. న్యూఢిల్లీతో పా టు హర్యానాలోని పలు చోట్ల కూడా భూమి కంపించింది. హర్యానాలోని ఝజ్జర్‌లో 10 కి.మీ లోతులో భూ కంపకేంద్రం ఉన్నట్టు నేషనల్ సెం టర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సీఎస్) వెల్లడించింది. ఝజ్జర్ రాజధాని ఢిల్లీకి 60 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.