12-07-2025 12:00:00 AM
ముంబై, జూలై 11: శివసేన మంత్రి సంజయ్ శిర్సాట్ చిక్కుల్లో పడ్డారు. శిర్సాట్ ఇంట్లో నోట్ల కట్టలకు సంబంధించిన బ్యాగ్ ఉన్నట్టు ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. శివసేన (ఉద్ధవ్) వర్గం నేత సంజయ్ రౌత్ ఈ వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేసి శిర్సాట్‌పై విరుచుకుపడ్డారు. సీఎం ఫడ్నవీస్‌పై కూడా ఆరోపణ లు గుప్పించారు. నిస్సహాయతకు మరోపేరు ఫడ్నవీస్ అని వ్యంగంగా వ్యాఖ్యానించారు. అయితే ఈ బ్యాగ్ దుస్తుల బ్యాగ్ అని శిర్సాట్ స్పష్టత ఇచ్చారు.