calender_icon.png 14 July, 2025 | 2:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెచ్చిపోయిన బలూచ్ రెబల్స్

12-07-2025 12:00:00 AM

  1. ప్రయాణికుల కిడ్నాప్.. తొమ్మిది మంది కాల్చివేత
  2. పాక్‌లోని దక్షిణ బలోచిస్థాన్ ప్రావిన్స్‌లో ఘటన
  3. దాడికి బాధ్యత తమదేనన్న బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్

న్యూఢిల్లీ, జూలై 11: పాకిస్థాన్‌లో బలూచ్ రెబల్స్ మరోసారి రెచ్చిపోయారు.  తాజాగా దక్షిణ బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని పర్వత ప్రాంతాల్లో పలు వాహనాలపై దాడి చేసి తొమ్మిది మందిని కాల్చి చంపారు. క్వెట్టా నుంచి పంజాబ్‌కు వెళుతున్న రెండు బస్సులను లోరలై హైవేపై సుర్ సమీపంలో గురువారం సాయంత్రం బస్సులను ఆపిన బలూచ్ రెబల్స్ .. ప్రయాణికుల్ని కిడ్నాప్ చేసి ఆపై బలవంతంగా సమీప కొండల్లోకి తీసుకెళ్లి హత్య చేసినట్టు స్థానిక మీడియా, అధికారులు తెలిపారు. 

కాగా బాధితుల్లో ఎక్కువ మంది పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. కాగా ఈ దాడికి బాధ్యత తమదేనని బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్ పేర్కొంది.బలూచ్‌కు చెంద ని పౌరులు, సైనిక సిబ్బందిని లక్ష్యంగా చేసుకుంటోంది. ఈ ఘటనకు కొద్ది రోజుల ముం దే, బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) దేశ వ్యాప్తంగా పలు దాడులకు తెరలేపింది. ‘ఆపరేషన్ బామ్’ పేరుతో దాడులు ప్రారంభించారు.

పంజ్ గర్, ఖరన్, కెచ్, సురబ్ జి ల్లాల్లో మొత్తం 17 దాడులు జరిగినట్టు స మాచారం. ఈ దాడుల్లో ప్రభు త్వ కార్యాలయాలు, సైనిక స్థావరాలు, చెక్ పాయింట్లు లక్ష్యంగా మారాయి. ఇది బలోచిస్థాన్ స్వా తంత్య్ర పోరాటంలో కొత్త అధ్యాయంగా నిలుస్తుందని తెలిపారు. భద్రతా బలగాలపై దాడి చేసి ఆయుధాలు, వస్తువులను స్వా ధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

బలోచ్ తి రుగుబాటుదారుల ఈ చర్యల వల్ల పాక్ భ ద్రతా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతున్నట్లు అంచనా. బలూచిస్థాన్ పాక్ ప్ర భుత్వానికి వ్యతిరేకంగా పో రాటం చేస్తోంది. స్థానిక వనరుల దోపిడీ, రాజకీయ అణచివేతకు ని రసనగా బలూచ్ గ్రూపులు సా యు ధ పో రాటం కొనసాగిస్తున్నాయి. తాజా ఘ టనతోఉద్యమం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.