ఈటల బ్రేక్‌ఫాస్ట్ మీటింగులు
22-04-2024 01:42 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆదివారం కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బొల్లారం పార్కులో మార్నింగ్ వాక్‌లో పాల్గొని ప్రసంగించారు. అనంతరం అస్మద్‌పేట్‌లోని పప్పు పటేల్ ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌లో పాల్గొని కార్యకర్తలతో మాట్లాడారు. అలాగే గాజులరామారాం, సుచిత్రలో నిర్వహించిన బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌ల్లో పాల్గొని ప్రసంగించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారంలోని రాంకీ మార్వెల్ టవర్స్ వాసులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. నాచారంలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో తదితరులు పాల్గొన్నారు.






