చర్చిలో రాగిడి లక్ష్మారెడ్డి ప్రార్థనలు
22-04-2024 01:38 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఏప్రిల్ (విజయక్రాంతి): మల్కాజిగిరి బీఆర్‌ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఆదివారం ఉప్పల్ డివిజన్‌లోని బీడ్ శభాచర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ముఖ్య నాయకులతో కలిసి ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాగిడి మాట్లాడుతూ.. తనకు అవకాశం ఇస్తే మల్కాజిగిరిని అభివృద్ధి చే స్తానని హామీ ఇచ్చారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని పలు కాలనీల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి నివేదిత సాయన్నతో కలిసి రాగిడి కుమార్తె డాక్టర్ మౌనిక రెడ్డి ప్రచారం నిర్వహించారు.






