calender_icon.png 5 July, 2025 | 5:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆటో కార్మికులకు న్యాయం చేయాలి

04-07-2025 08:45:39 PM

ఐటీడీఏ పీవోకు వినతిపత్రం సమర్పించిన ఆటో కార్మికులు

భద్రాచలం,(విజయక్రాంతి):  భద్రాచలం కాలేజీ గ్రౌండ్ పక్కన ఎంతో కాలంగా ఆటోలు నడుపుకుంటున్న తమకు న్యాయం చేయాలంటూ ఆటో యూనియన్ జేఏసీ సభ్యులు శుక్రవారం ఐటిడిఏ పిఓ బి.రాహుల్ కి వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల కాలేజీ గ్రౌండ్ వద్ద ఎన్నో సంవత్సరాలుగా ఆటో కార్మికులందరూ యూనియన్ గా ఏర్పడి అడ్డా ఏర్పాటు చేసుకొని కూనవరం, చింతూరు మండలాలకు ఆటోలు నడుపుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నామని వారు తెలిపారు.

ఇటీవల ప్రభుత్వం ఉచిత మరుగుదొడ్లను ఏర్పాటు చేయగా అక్కడ ఉంటున్న ఒక బడా వ్యాపారి కుటుంబ సభ్యులు, మహిళలు ఆటో అడ్డ స్థలాన్ని ఆక్రమించి బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే గ్రామ పంచాయతీ కార్యదర్శికి, పట్టణ పోలీసులకే ఫిర్యాదు చేయడం జరిగిందనీ. ఎన్నో వందల కుటుంబాలు జీవనాధారమైన మా కడుపు కొట్టకుండా, ఆటో కార్మికులమైన మాకు న్యాయం చేయాలని వినతి పత్రం ద్వారా ఐటీడీ పీఓను భద్రాచలం జేఏసీ ఆటో యూనియన్ కోరారు.