calender_icon.png 5 July, 2025 | 5:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కనబడుటలేదు

04-07-2025 08:57:31 PM

చేగుంట,(విజయక్రాంతి): చేగుంట మండల పరిధిలోని వళ్లు గ్రామానికి చెందిన మహమ్మద్ షౌకత్ (44) నివాసము వల్లూరు గ్రామము,  ప్రస్తుత నివాసము చేగుంట. నిన్న రాత్రి ఇంట్లో వారు అందరూ పడుకున్నాక, ఇంట్లో నుండి ఎవరికి, చెప్పకుండా, ఎటో వెళ్లిపోయినాడు, కుటుంబ సభ్యులు, చుట్టుప్రక్కల, బంధువుల దగ్గర ఎంత వెతికిన అతని ఆచూకీ దొరకలేదు అతని భార్య పుదీనా బేగం ఫిర్యాదు మేరకు అతడు చామన చాయ రంగు ఉండి కొల ముఖము కలడు, సుమారు 5.5 ఫీట్ల ఎత్తు కలడు అతని పై పసుపు రంగు షర్టు నీలం రంగు ప్యాంటు కలదు అని ఇట్టి విషయములో మహమ్మద్ రుబీనా బేగం  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని  దర్యాప్తు చేస్తున్నట్టు చేగుంట ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు.