calender_icon.png 5 July, 2025 | 5:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

04-07-2025 09:01:48 PM

దౌల్తాబాద్,(విజయక్రాంతి): దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లోని అన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడిఈ శ్రీనివాసరావు శుక్రవారం పేర్కొన్నారు. 132 కెవి, 33 కెవి,11 కెవి దౌల్తాబాద్, రాయపోల్, ముబారస్పూర్, గుర్రాల సోఫా సబ్ స్టేషన్ లో ఫీడర్ మరమ్మతులతో శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. విద్యుత్ అంతరాయానికి గ్రామాల ప్రజలు, విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన తెలిపారు.