04-07-2025 08:49:17 PM
లబ్ధిదారులకు వెంటనే లక్ష రూపాయల గ్రాంట్ ఇవ్వాలి
దళితులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు ఇవ్వరా
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
హుజరాబాద్,(విజయక్రాంతి): ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అమాయక ప్రజలపై కేసులు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం భయ బ్రాందులకు గురి చేస్తుందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గ పరిధిలోని వీణవంక మండలంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ప్రొసీడింగ్లు రద్దు చేసిన వారి ఇండ్లనుశుక్రవారంపరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పేదల ఇళ్ల ప్రొసిడింగ్‌లను ప్రభుత్వం రద్దు చేయడాన్ని ఆయన ఖండించారు. మూడు రూపాయల అప్పు తీసుకుని పిలర్స్ వేశారని… ఇప్పుడు వారిని బెదిరిస్తున్నారని ఆరోపించారు.
ఇల్లు అడిగితే కేసులా?పాతబస్తీ ప్రజలకు 20 ఏళ్ల క్రితం ఇచ్చిన కొన్ని సిమెంట్ బస్తాల కోసం ప్రస్తుత ఇళ్లను రద్దు చేయడాన్ని ఆయన అభమానకరంగా అభివర్ణించారు. ప్రశ్నించిన ములుగు యువకుడిపై అక్రమ కేసులు పెట్టి ఆత్మహత్యకు నెట్టారని ఆరోపించారు.వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు అడ్వాన్స్‌గా ఇచ్చే ప్రభుత్వం, పేదలకు ఇచ్చే లక్ష రూపాయల గ్రాంట్ ఇవ్వలేదంటే అది ప్రభుత్వ నిష్క్రియకు నిదర్శనం అని అన్నారు.రైతు బంధు… ప్రకటనలే గానీ నిధుల్లేవు!...రైతులకు ఇప్పటిదాకా ఒక్కొక్కరికి రూ.15,000 కూడా ఇవ్వలేదని తెలిపారు. ఎన్నికల ముందు వాగ్దానాలు, తరువాత వాయిదాలు వేస్తూ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని వాపోయారు.
దళిత బంధు… కళ్యాణ లక్ష్మికి జాప్యం దళితులకు ఇళ్లు ఇవ్వకపోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో జాప్యం జరుగుతుందని కల్యాణ లక్ష్మితో పాటు ఎన్నికల హామీలో ఇచ్చిన తులం బంగారం ప్రభుత్వం వెంటనే అందించాలని డిమాండ్ చేశారు.రద్దు చేసిన ఇళ్ల ప్రొసిడింగ్‌లను వెంటనే పునరుద్ధరించాలి.లబ్ధిదారులకు రూ.1,00,000 గ్రాంట్‌ను తక్షణమే ఇవ్వాలి.పెండింగ్‌లో ఉన్న రైతు బంధు మొత్తాలు విడుదల చేయాలి.దళితులకు, మైనారిటీలకు ప్రభుత్వం సమానంగా ఇళ్ల మంజూరు చేయాలన్నారు.ములుగు యువకుడిపై పెట్టిన కేసులు తొలగించి, కుటుంబానికి రూ.1 కోటి నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.