04-07-2025 08:59:54 PM
మంథనిలో స్వామి వివేకానంద స్టాచ్యూ ఫౌండర్ అండ్ చైర్మన్ బెజ్జంకి డిగంబర్
మంథని,(విజయక్రాంతి): యువతకు ఆదర్శం స్వామి వివేకానంద అని, స్వామి వివేకానంద స్టాచ్యూ ఫౌండర్ అండ్ చైర్మన్ బెజ్జంకి డిగంబర్ అన్నారు. శుక్రవారం స్వామి వివేకానంద 123వ వర్ధంతిని పురస్కరించుకొని మంథని పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా గల స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా డిగంబర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిగంబర్ మాట్లాడుతూ భారత దేశ గొప్పతనాన్ని సంస్కృతిని ప్రపంచ వ్యాప్తం చేసింది స్వామి వివేకానంద అని ఆయన పేర్కొన్నారు. చికాగోలో జరిగిన ప్రపంచ మత మహాసభల్లో హిందూ మత గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అని, స్వామి వివేకానంద మాటలు నేటి యువతకు గొప్ప మార్గదర్శకంగా ఉంటాయని, ఆయనను ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకోవాలని, మంథని పట్టణంలో తాను ఈ విగ్రహం నెలకొల్పడాన్ని నా అదృష్టంగా భావిస్తున్నానని, దీనికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.