26-07-2025 01:18:08 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 25 (విజయక్రాంతి): ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణల నేపథ్యంలో అరెస్టయి, జైలు నుంచి బయటకు వచ్చిన హెచ్‌ఎండీఏ మాజీ ప్లానింగ్ డైరెక్టర్ శివబాలకృష్ణకు మరో ఎదురుదెబ్బ తలిగింది. ఏసీబీ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
శివబాలకృష్ణ అక్రమాస్తుల లెక్క తేల్చేందుకు, అతడు పెట్టుబడి పెట్టినట్టు భావిస్తున్న బినామీ రియల్ ఎస్టేట్ సంస్థ లు.. శ్రీకృష్ణ కన్‌స్ట్రక్షన్, కారీస్ స్పైసెస్, ఉదయ ప్రాజెక్ట్ కార్యాలయా లు, ఆయా సంస్థల డైరెక్టర్ల ఇండ్లపై ఈడీ అధికా రులు ఆకస్మిక దాడులు చేపట్టారు. కొండాపూర్, రామంతాపూర్, లక్డీకపూల్ ప్రాం తాల్లో ఈ సోదాలు ఏకకాలంలో కొ నసాగాయి. ఈ దాడుల్లో ఆస్తులకు సంబంధించిన పలు కీలక రికా ర్డు లు, డిజిటల్ ఆధారాలు, ఇతర ప్రాప ర్టీ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.
కాగా జూలై 3న కూడా శివబాలకృష్ణకు చెందిన ఇండ్ల లో ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. రాజేంద్రనగర్‌లోని శివ బాలకృష్ణ ఇంటితో పాటు చైతన్యనగర్‌లోని ఆయన సోదరుడు నవీన్ కుమార్ ఇంట్లో, మరికొన్ని ప్రాంతా ల్లో సోదాలు జరిపి కీలక పత్రాలను సీజ్ చేశారు. ఒకే నెలలో ఈడీ అధికారులు శివబాలకృష్ణ ఇంటిపై రెండు సార్లు దాడులు నిర్వహించడం ప్రస్తు తం హాట్ టాపిక్‌గా మారింది.
గతం లో హెచ్‌ఎండీఏలో ప్లానింగ్ డైరెక్టర్ గా పనిచేసిన శివబాలకృష్ణ, హైదరాబాద్ మెట్రో రైల్ ప్లానింగ్ ఆఫీసర్ గా, రియల్ ఎస్టేట్ రె గ్యులేటరీ అథారిటీ (రెరా)లో అదనపు కార్యదర్శిగా పనిచేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గతేడాది జనవరి 25 న ఆయనతో పాటు నవీన్‌కుమార్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశా రు. విచారణలో భాగంగా శివబాలకృష్ణ ఆయా వెంచర్లకు అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చి భారీగా ఆస్తులు కూ డబెట్టినట్టుగా వెల్లడైంది.
హైదరాబాద్‌తో పాటు సిద్దిపేట, జనగామ, భువనగిరి, నాగర్‌కర్నూల్ తదితర జిల్లాల్లో 200 ఎకరాలకు పైగా భూములను కొనుగోలు చేసినట్టుగా తేలింది. ఆదాయానికి మించిన ఆస్తుల విలువ రూ.8.26 కోట్లుగా ఏసీబీ అధికారులు తేల్చగా, ఓపెన్ మార్కెట్‌లో వాటి విలువ రూ. 200 కోట్లకుపైగా ఉంటుందని అంచనా.