26-07-2025 01:17:42 AM
- మూత్రం లీకేజీతో బాధపడుతున్న మహిళ
- రోగి సొంత కణజాలాలతో స్లింగ్ వేసిన వైద్యులు
- పూర్తిగా కోలుకున్న బాధితురాలు
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 25 (విజయక్రాంతి): నవ్వినా, దగ్గినా, చివరకు కొద్దిగా వంగినా, కదిలినా కూడా మూత్రం లీకేజీ సమస్యతో బాధపడుతున్న మహిళకు కిమ్స్ వైద్యులు వినూత్న శస్త్రచికిత్స చేసి, కాపాడారు. దీన్ని వైద్య పరిభాషలో స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ (ఎస్యూఐ) అంటారు. దీనివల్ల ఆమె డైపర్లు వాడాల్సి వస్తోంది. పలువురు వైద్యులకు చూపించినా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆమె సికింద్రాబాద్‌లోని కిమ్స్ కడల్స్ ఆస్పత్రికి వచ్చారు.
ఇక్కడ ఆమెకు చికిత్స చేసి, సమస్యను పూర్తిగా పరిష్కరించిన కన్సల్టెంట్ యూరోగైనకాలజిస్ట్, లాప్రోస్కొపిక్ సర్జన్ డాక్టర్ ఎన్. బిందుప్రియ ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపారు. “ఎస్యూఐ సమస్య తో వచ్చిన ఆ మహిళకు అన్ని రకాల పరీక్షలు చేశాం. ఆమెకు ఇప్పటికే హిస్టరెక్టమీ (గర్భసంచి తొలగింపు) శస్త్రచికిత్స జరిగింది. దానికి తోడు చాలా కాలం నుంచి ఆమె తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నారు.
మా మూలుగా అయితే ఎస్యూఐ సమస్యను పరిష్కరించేందుకు ఒక సింథటిక్ మెష్ వేస్తాం. కానీ, ఆమెకు ఉన్న నొప్పివల్ల అలా చేయలేం. అందుకే ఆమెకు ఈ విషయాన్ని పూర్తిగా వివరించి, ఆటోలోగస్ రెక్టస్ ఫేషియల్ స్లింగ్ (రోగి సొంత కణజాలంతోనే రూపొందించిన స్లింగ్) అమర్చాలని నిర్ణయించాం. ఇందుకు సంబంధించిన శస్త్రచికి త్స విజయవంతంగా జరిగింది. సర్జరీ తర్వా త మూత్రం వెల్లడానికి ఇబ్బంది కనిపించింది.
దాంతో మరిన్ని పరీక్షలు చేయగా.... అది సిలింగ్ టైట్ అయినం దుకు కాదు కానీ ముస్కల్స్ రిలాక్స్ కానందుకు ప్రాబ్లం అని తేలింది. దాంతో ఆమె మూత్రకోశం పనితీరు మెరుగయ్యేలా కొన్ని రకాల మందులు వాడడంతో పాటు ఫిజియోథెరపీ కూడా చేయిం చాం. అవి చేసిన తర్వాత ఆమెకున్న ఎస్యూఐ సమస్య పూర్తిగా నయమైపోయింది. దాంతో ఆమె చాలా ఊరట పొం దారు.
అన్ని విభాగాల వైద్యులు, ఇతర సహా య సిబ్బంది సాయం తీసుకోవడంతో ఆమె పూర్తిగా కోలుకున్నారు” అని తెలిపారు. సమస్యను పూర్తిగా పరిష్కరించిం దుకు బాధితు రాలు, ఆమె కుటుంబ సభ్యు లు కిమ్స్ ఆస్పత్రికి ధన్యవాదాలు తెలిపారు అని డాక్టర్ బిందుప్రియ వివరించారు.