calender_icon.png 17 July, 2025 | 9:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థికి విద్య ఆయుధం

25-06-2025 12:22:44 AM

న్యాయ విజ్ఞాన సదస్సులో న్యాయమూర్తి నసీమ్ సుల్తానా 

తాడూరు, జూన్ 24: రాజ్యాంగం కల్పించిన హక్కులన్నింటినీ పొందుతూ ఉన్నత స్థాయికి ఎదగాలంటే విద్య అత్యంత ప్రధాన ఆయుధంగా పనిచేస్తుందని నాగర్ కర్నూల్ జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి,  జిల్లా న్యాయమూర్తి నసీం సుల్తానా అన్నారు. మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండల కస్తూర్బా గాంధీ పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.

విద్యార్థులు స్మార్ట్ ఫోన్ వినియోగం తగ్గించి సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని, ఉన్నత శిఖరాలకు తాకేందుకు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని చదువుకోవాలన్నారు. ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని వాటిని సద్వినియోగం చేసుకొని ముందుకెళ్లాలన్నారు.

రాజ్యాంగం కల్పించిన హక్కులు బాధ్యతలను గుర్తెరిగి సమాజానికి సేవ చేసే విధంగా ఎదగాలన్నారు. అనంతరం తాడూరు మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు.  వారితోపాటు ఎస్‌ఓ విజయ, సిఆర్టిలు విద్యార్థులుఉన్నారు.