షాద్‌నగర్ చౌరస్తాలో మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మ దగ్ధం
షాద్‌నగర్,(విజయక్రాంతి): కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే భారత ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా షాద్‌నగర్ పట్టణంలో బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలుమల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మ దగ్ధం చెసారు. ఈ సందర్భంగా బీజేపీ షాద్‌నగర్ ఇన్‌చార్జ్ అందే బాబయ్య మాట్లాడుతూ, దేశానికి సేవలందిస్తున్న ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని పేర్కొన్నారు.
ప్రజలు అలాంటి వ్యాఖ్యలను సమర్థించరని, భవిష్యత్తులో తగిన సమాధానం ఇస్తారని అన్నారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేష్ గుప్త మాట్లాడుతూ, దేశ ప్రధానిని ఉగ్రవాదులతో పోల్చడం దేశద్రోహానికి సమానం అని విమర్శించారు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు కాకుండా అభివృద్ధి అంశాలపై మాట్లాడాలని సూచించారు.
ఈ కార్యక్రమం బీజేపీ పట్టణ కన్వీనర్ శ్రీనివాస్ చారి, ఫరూక్‌నగర్ మండల అధ్యక్షుడు పిట్టల సురేష్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర నాయకులు వంశీకృష్ణ, కౌన్సిలర్ ప్యాట అశోక్, చెట్ల వెంకటేష్, మోహన్ సింగ్, మల్చల మురళి, మంగ విజయ్, క్యామ మహేష్, అందేల్ సందీప్, బాల్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి, కాసోజు శివ తదితరులు పాల్గొన్నారు..






