calender_icon.png 27 January, 2026 | 3:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హోటల్ కార్మికుల సంక్షేమానికి కృషి

27-01-2026 12:28:33 AM

ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి

పటాన్‌చెరు, జనవరి 26 :హో టల్ రంగంలో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమానికి ఎల్లప్పుడూ అం డగా నిలుస్తున్నామని.. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో వారికి తగు ప్రాధాన్యత ఇస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ హోటల్ కార్మికుల సంక్షేమ సంఘం పటాన్చెరు పటాన్చెరు నియోజకవర్గం కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. సంఘం సభ్యులకు గుర్తింపు కార్డులు అందజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మిక రంగం నేపథ్యం నుండి వచ్చిన తాను కార్మికుల కష్టాలు తెలుసునని అన్నారు. హోటల్ రంగంలో పనిచేస్తున్న కార్మికులు అందరూ ఒక్కతాటిపై నిలిచి కార్మిక సంఘం ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు అనిల్, అసోసియేషన్ ప్రతినిధులు సంజీవ్, అమృత్, శేఖ ర్, నరసింహ, సునీల్, నరసింహులు, రవి, కోటేశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు.