27-01-2026 12:27:16 AM
ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ కృష్ణమూర్తి
సిద్దిపేట, జనవరి 26 (విజయక్రాంతి): సిద్దిపేటలో కంటి వైద్య సేవలు అందిస్తున్న ఆద్య ఐ కేర్ నిర్వాహకులు డాక్టర్ మాధవి, డాక్టర్ బాలకిషన్ సేవలు అభినందనీయమని ప్రముఖ సీనియర్ కంటి వైద్య నిపుణులు డాక్టర్ కృష్ణమూర్తి అన్నారు. సోమవారం ఆధ్య ఐ కేర్ వార్షి కోత్సవం సందర్భంగా పలువురు ప్రముఖుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వైద్యులను అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ పేదలైన వయోవృద్ధులకు ఉచితంగా ఆపరేషన్లు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
సంవత్సర కాలంలోనే సిద్దిపేట జిల్లాలో తనదైన ప్రత్యేక ముద్ర వేసుకోవడం ఆధ్య ఐ కేర్ కి సాధ్యమైందని తెలిపారు. భవిష్యత్తులో మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గ్యాదర్ రవి, ప్రముఖ చార్టర్ అకౌంటెంట్ కాచం శేఖర్, చేర్యాల మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కృష్ణ, పలువురు వైద్యులు ప్రముఖులు, సిబ్బంది అనిల్, నవీన్, స్వాతి, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.