కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలి
మేడ్చల్ అర్బన్ జూలై 7(విజయక్రాంతి):కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ చెప్పారు.మంగళవారం బోడుప్పల్ లోని వజ్రేష్ యాదవ్ నివాసంలో జరిగిన సమావేశంలో మేడ్చల్ నియోజకవర్గం నుండి నూతనంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా ఎన్నికైన ఉదoడపురం సత్యనారాయణను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఎన్నికైన సత్యనారయణకు జిల్లా అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ నివాసంలో నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు పేదల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. అనంతరం సత్యనారాయణ మాట్లాడుతూ నామీద నమ్మకంతో నాకు మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నియమించిన జిల్లా అద్యక్షులు వజ్రేష్ యాదవ్ మేడ్చల్ నియోజకవర్గ మాజి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి.జిల్లా మాజి అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి.రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్.జిల్లా పరిషత్ మాజి చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి.లకు సత్యనారాయణ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు..






