11-07-2025 12:29:45 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై10(విజయక్రాంతి): ఆంగ్ల భాష అభివృద్ధి కోసం ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి అన్నారు.గురువారం జిల్లా కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాన్ని ఆమె సందర్శించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మూడు నుండి 5వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆంగ్లభాషలో సామర్ధ్యాల పెంపు లావణ్యం కోసం విభ లీప్ ఫార్వర్డ్ సంస్థ ప్రోగ్రాం నిర్వహిస్తున్న తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీ ఎంఓలు ఉద్దవ్, జగన్ ,ఏటిడిఓ చిరంజీవి, గిరిజన క్రీడా అధికారి మీనారెడ్డి, లీఫ్ ఫార్వ ర్డ్ సంస్థ సభ్యులు లక్ష్మణ్ రావు ,ప్రశాంత్ ,సునీత, రవళి ,రమేష్ ,మ్యాతిన్, రిసోర్స్ పర్సన్‌లు పాల్గొన్నారు.