11-07-2025 12:30:33 AM
నిధుల మంజూరుకు ఎమ్మెల్యే హామీ
తలకొండపల్లి,జులై 10: తలకొండపల్లి మండలం చంద్రధన గ్రామ పంచాయితీలో అభివృద్ది పనులకు నిధులు మంజూరు చేయాలని కోరు తూ గ్రామస్తులు గురువారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని కలి సి వినతిపత్రం అందజేశారు. గ్రామ పంచాయతీ లోని ఫుల్ సింగ్ తాండా లో ఎలాంటి అభివృద్ది జరగలేడని,ఒక సారి గ్రామాన్ని సందర్శించి పరిశీలించాలని ఎమ్మెల్యే కువారు విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా గ్రామానికి చెందిన బిఆర్‌ఎస్,బీజెపీ పార్టీలకు చెందిన కొంతమంది నాయకులు,కార్యకర్తలు ఎమ్మెల్యే నారాయణరెడ్డి సమక్షంలో కాంగ్రేస్ పార్టీలో చేరారు.పార్టీలో చెరినవారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆవ్వానించారు. కాంగ్రేస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది,సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు.
రాబోయే స్థానిక సంస్థలైన గ్రామ పంచాయతీ,మండల,జిల్లా పరిషత్ ఎన్నికలో కాంగ్రేస్ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఎమ్మెల్యే నారాయణరెడ్డి నాయకులు,కార్యకర్తలను ఆదేశించారు. కార్యక్రమంలో పార్టీ గ్రామ కమిటి అద్యక్షుడు శంకర్ రెడ్డి,మాజీ ఎంపిటిసి రాములు,రాజేందర్ రెడ్డి,మాజీ సర్పంచ్ భిమ్లానాయక్,భక్తి యాదగిరి,సబావట్ వెంకటయ్య,గోపాల్ నాయక్,మేఘావత్ శ్రీను,తిరుపతి,చందర్,దాస్య లు పాల్గొన్నారు.