calender_icon.png 11 July, 2025 | 7:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉభయ సభలు సజావుగా సాగడానికి సహకరించాలి

11-07-2025 12:28:44 AM

  1. స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
  2. మీడియాకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తాం
  3. రాష్ట్ర శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు  
  4. అసెంబ్లీ కమిటీహాల్‌లో మీడియా అడ్వుజరీ కమిటీ తొలి సమావేశం

హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): తెలంగాణ లేజిస్లేటివ్ మీడియా అడ్వుజరీ నూతన కమిటీ మొదటి సమావేశం గురువారం శాసనసభ భవనంలోని కమిటీహాల్‌లో జరిగింది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమా ర్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, లేజిస్లేటివ్ సెక్రటరీ డాక్టర్ నరసింహా చార్యులు తదితరులు పాల్గొన్నారు.

స్పీకర్ ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో కీలకమైన శాసనసభ, మండలి గౌర వం, ప్రాధాన్యతలను కాపాడుతూ మీడియా సలహా మండలి ద్వారా మీ వంతుగా  సేవలను అందించడం మంచి అవకాశమన్నారు. సీనియర్ జర్నలిస్టులుగా మీరు ఎంతో అనుభవం కలిగి ఉన్నవారని, ఉభయ సభ లు సజావుగా జరగడానికి మీ సహకారాన్ని ఎల్లప్పుడూ అందించాలని కోరారు.

మండలి చైర్మన్ గుత్తా సుఖేంద ర్ రెడ్డి మాట్లాడుతూ.. శాసనసభ, శాసనమండలి సమావేశాలు సజావుగా జరగాలంటే మీడియా పాత్ర కీలక మని చెప్పారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభను హుందాగా నడవడానికి అన్ని విధాలుగా సహకారం అందించాలని, రానున్న రోజుల్లో శాసనసభ, శాసన మండలి ఒకే భవనంలోకి రాబోతున్నందున కావున కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. అసెంబ్లీ వ్యవహారాల్లో మీడియాకు బాధ్యతను కల్పించడానికి, మరింత పాత్రను పోషించడానికే మీడియా అడ్వుజరీ కమిటీని నియమించినట్టు తెలిపారు. ఉభయ సభల నిర్వాహణలో అందరి సహకారాన్ని కోరారు. సమావేశాల సందర్భంగా మీడియా ప్రతినిధులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

సమావేశంలో మీడియా కమిటీ చైర్మన్ ఐరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మీడియా అడ్వైజరీ కమిటీ కో చైర్మన్ పరిపూర్ణాచారి, సభ్యులు అయితరాజు  రంగారావు, సుంచు అశోక్, బొడ్లపాటి పూర్ణచందర్‌రావు, వెంకట్రామిరెడ్డి, పొలంపల్లి అంజనేయులు, ఎం. ప్రవీణ్‌కుమార్, బీమనపల్లి అశోక్, బుర్రా అంజనేయులుగౌడ్, సురేఖ అబ్బూరి, మహ్మద్ నయీమ్ వాజత్, బి. బసవపున్నయ్య, ప్రమోద్‌కుమార్, బీహెచ్‌ఎంకే గాంధీ పాల్గొన్నారు.