calender_icon.png 27 November, 2025 | 9:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీపీ ఎన్నికలు సాఫీగా జరిగేలా కృషి చేయాలి

27-11-2025 12:00:00 AM

కలెక్టర్ సి.నారాయణరెడ్డి

అబ్దుల్లాపూర్‌మెట్, నవంబర్ 26: గ్రామ పంచాయతీ ఎన్నికలు సాఫీగా జరిగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అన్నారు. జీపీ ఎన్నికల నిర్వహణపై బుధవారం సమీకృత కార్యాలయం నుంచి ఆర్డీవోలు, ఎంపీడీవోలు, ఎంపీవోలకు ఎన్నికల నిర్వహణపై  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జీపీ ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాటు పూర్తి చేసుకోవాల అధికారులకు సూచించారు. ఎన్నికల నియమ, నిబంధనలపై అవగాహనతో ఉండాలన్నారు.   

అధికారులు, సిబ్బంది క్రియాశీలక పాత్ర పోషించి.. పరస్పర సమన్వయంతో  పనిచేసి.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సాఫీగా జరిగేలా కృషి చేయాలన్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చి వెంటనే రాజకీయ పార్టీలకు హోర్డింగులు, పోస్టర్లు, ప్రభుత్వ ఆఫీసులలో, సంస్థల గోడలపై రాతలు ఉండే వెంటనే తొలగించాలని అధికారులకు ఆదేశించారు. నిఘా బృందాలను నియమించి, పకడ్బందీగా కోడ్ అమలు జరిగేలా పర్యవేక్షించాలన్నారు.

ఓటర్లను ప్రభావితం చేసే చర్యలకు ఎక్కడిక్కడ అడ్డుకట్ట వేయాలని అన్నారు. ఎన్నికల సామాగ్రిని జాగ్రత్తగా సరి చూసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలలో మౌలిక సదుపాయాలను ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. సర్పంచ్, వార్డు స్థానాల రిజర్వేషన్ల జాబితాను మరో సారి పరిశీలించి.. తప్పిదాలకు తావులేకుండా చూడలన్నారు..

ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ నామినేషన్లు స్వీకరించాలని సూచించారు. నామినేషన్ల స్వీకరణ, స్క్రూట్నీ, ఉపసంహరణ, పోలింగ్, కౌంటింగ్ తదితర అన్ని ప్రక్రియలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమ, నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జడ్పీసీఈవో కృష్ణారెడ్డి, డీపీవో సురేశ్ మోహన్, నోడల్ అధికారులు, ఆర్డీవోలు, ఎంపీడీవోలు, తదితరులు  పాల్గొన్నారు.