calender_icon.png 27 November, 2025 | 10:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజయం వైఫల్యానికి వ్యతిరేకం కాదు..

27-11-2025 08:33:04 PM

డి ఆర్ డి ఏ ఈ జి ఎం ఎం ట్రైనర్ మహేష్

గద్వాల: విజయం వైఫల్యానికి వ్యతిరేకం కాదు  అని విజయం అనేది మెరుగైన చర్యల సారాంశం అని డి ఆర్ డి ఏ ఈ జి ఎం ఎం ట్రైనర్ మహేష్ విద్యార్థులతో అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం గద్వాల జిల్లాలోని కేజీబీవి పాఠశాలలోని 10 వ తరగతి విద్యార్థినుల పరీక్షల కోసం ఉత్సాహభరితమైన శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. చదువు పట్ల సానుకూల దృక్పథం కోసం - ఇది చాలా కష్టం అని భావించకుండా నేను  నేర్చుకుంటున్నాను ఇది నా జీవితాన్ని మారుస్తుంది అని సానుకూల దృక్పథంతో  పలుమార్లు మనసులో అనుకుని చదువుకోవాలి.

మొబైల్ ఫోన్, టీవీ వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. అలసటగా ఉన్నప్పుడు చిన్నపాటి వ్యాయామం ద్వారా శారీరక శక్తిని పెంచుకొని తర్వాత మళ్లీ చదువుకోవడానికి ప్రారంభించాలని సూచించారు. లక్ష్యం స్పష్టంగా ఉంటే  సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించవచ్చు అని అన్నారు. పనులను వాయిదా వేయకుండా ముందుగానే ప్రణాళికతో చదవడం అవసరమని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్రీదేవి, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.