27-11-2025 08:28:14 PM
దీక్షాదివస్ కేవలం పార్టీ కార్యక్రమం కాదు; ఇది తెలంగాణ పోరాట గాథను ప్రజలకు గుర్తు చేసే రోజు..
మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి..
మేడిపల్లి (విజయక్రాంతి): ఈ నెల 29వ తేదీన జరగనున్న “దీక్షాదివస్” కార్యక్రమం విజయవంతం చేసేందుకు పీర్జాదిగూడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రధానకార్యదర్శి ఏడవల్లి రఘువర్ధన్ రెడ్డి, ఆధ్వర్యంలో జరిగిన ఈ సన్నాహక సమావేశానికి మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ దీక్షా దివస్ కేవలం పార్టీ కార్యక్రమం కాదు తెలంగాణ పోరాట గాధను, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తెలియజేస్తున్నామని, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం నాయకుడు మహానేత కేసీఆర్ చేసిన గొప్ప పోరాటం, వేలాది మంది విద్యార్థులు, యువత త్యాగాలు, ఉద్యమ నాయకత్వం చేసిన దీక్షలు, నిరాహార దీక్షలు, ఆత్మాహుతులు వంటి చారిత్రక ఘటనలను ప్రజలకు మరోసారి గుర్తు చేస్తామని అన్నారు.
ఈ సందర్బంగా తెలంగాణ తల్లి, అమర వీరుల స్టూపాలకు పాలాభిషేకం, వృద్ధా ఆశ్రమాలలో పండ్లు పంపిణీ చేయడం, తెలంగాణ ఉద్యమ చరిత్ర యొక్క ఛాయ చిత్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు దొంతిరి హరిశంకర్ రెడ్డి,కొల్తూరు మహేష్, లేతాకుల మాధవి రఘుపతి రెడ్డి,వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు మనోరంజన్ రెడ్డి, 14డివిజన్ అధ్యక్షుడు జావిద్ ఖాన్, మహిళా అధ్యక్షురాలు నిర్మల, యూత్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, బాలరాజు,కిరణ్ గౌడ్,ప్రవీణ్ రెడ్డి శ్రీనివాస్, జోగి రెడ్డి,శంకర్ గౌడ్ శ్రీరాములు గౌడ్ ప్రసాద్ అక్షత్,యాదవ్ మల్ల వెంకటేష్ గౌడ్, కూరెళ్ళ ఉపేందర్ రాధాకృష్ణన్ రావు,జగన్ రెడ్డి,నరేందర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, లగ్గాని సోమేశ్ గౌడ్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.