calender_icon.png 27 November, 2025 | 10:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదివారం నుంచి రెండో విడత నామినేషన్ల స్వీకరణ

27-11-2025 08:42:54 PM

కొత్త బ్యాంక్ అకౌంట్ కంపల్సరీ

తూప్రాన్ ఆర్డీవో జయ చంద్రారెడ్డి

తూప్రాన్ (విజయక్రాంతి): సర్పంచ్ వార్డు అభ్యర్థులకు తూప్రాన్ ఆర్డీవో జయచంద్ర రెడ్డి కొన్ని సూచనలను తెలిపారు. ఇందులో భాగంగా ఆదివారం నుండీ 4 మండలాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతుందన్నారు. సర్పంచు, వార్డు స్థానాలకు పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లో కొత్త బ్యాంక్ అకౌంట్ ను లేదా కొత్త పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ను  అభ్యర్థులు తమ నామినేషన్ పత్రంతో పాటు సమర్పించాలని తూప్రాన్ ఆర్డీవో తెలిపారు. తూప్రాన్ డివిజన్ పరిధిలోని తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట, నార్సింగి మండల పరిధి గ్రామ పంచాయతీలకు, వార్డు స్థానాలకు ఈ ఆదివారం నుంచే నామినేషన్లను ఆయా ఎంపిడిఓ ఆఫీసుల పరిధిలో స్వీకరిస్తారని సంబంధిత సర్టిఫికెట్లను జతపరచి నామినేషన్ వేయుటకు రావాలనీ ఆర్డీవో తెలిపారు.