27-11-2025 08:34:51 PM
అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్
నకిరేకల్ (విజయక్రాంతి): నామినేషన్లు ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాని నల్లగొండ రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. గురువారం కట్టంగూర్, అయిటిపాముల గ్రామాల్లో నామినేషన్ల స్వీకరణను ఆయన పరిశీలించి మాట్లాడారు. నామినేషన్ స్వీకరణకు కేంద్రానికి అభ్యర్థితో పాటు మరో ఇద్దరిని మాత్రమే అనుమతించాలన్నారు. నామినేషన్ పక్రియలో అభ్యర్ధులకు ఎలాంటి సందేహాలు ఉన్నా హెల్ప్ డెస్క్ ద్వారా సందేహాలను నివృతి చేయాలని అధికారులకు సూచించారు.
అధికారులు జాగ్రత్తగా విధులు నిర్వహించడంతో పాటు స్వీకరించిన నామినేషన్ పత్రాలను గ్రామాల వారిగా వేర్వేరుగా భద్రపర్చాలని పేర్కొన్నారు. మండల వ్యాప్తంగా సర్పంచ్ స్థానాలకు 23, వార్డు సభ్యుల స్థానాలకు 21 నామినేషన్లు స్వీకరించినట్లు ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి సతీశ్, తహసీల్దార్ పుష్పలత, ఎంఈఓ అంబటి అంజయ్య, ఎంపీఓ స్వరూపారాణి పంచాయతీ కార్యదర్శి అశోక్ ఉన్నారు.