27-11-2025 08:30:43 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయంలో 14 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా తెలుగు విభాగానికి పిహెచ్ డి అవకాశం కల్పించినందుకు శాతవాహన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య విసి ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ కు తెలుగువిభాగం ఆచార్యులు, విద్యార్థులు ,మర్యాదపూర్వకంగా కలిసి గజమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా శాతవాహన యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్ జేఏసీ చైర్మన్ చెన్నమల్ల చైతన్య మాట్లాడుతూ 14 సంవత్సరాల కలను సాకారం చేసినందుకు వారికి మేమెంతో రుణపడి ఉంటామని, తెలుగు విభాగం లో విద్యార్థులు నెట్ లు, సెట్ లు ,జే ఆర్ ఎఫ్ లు సాధించి మిగతా యూనివర్సిటీలలో అవకాశాలు లేక సన్నగిల్లారని, వారు సాధించిన సర్టిఫికెట్స్ కు విలువలేక ఇబ్బంది పడినటువంటి సందర్భంలో ఇవాళ వైస్ ఛాన్స్ లర్ తెలుగు విభాగం పట్ల ఇంత చక్కటి ప్రేమను కనబరిచి మాకు అవకాశాలు కల్పించినందుకు సార్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తదనంతరం విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ మాట్లాడుతూ శాతవాహన విశ్వవిద్యాలయాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్లేందుకు తమ కృషి నిరంతరంగా కొనసాగుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగు విభాగం ఆచార్యులు డా. జి. లక్ష్మీ నారాయణ, డా. పావని , స్వరాజ్యం, కుందేటి సత్యనారాయణ, బోడకుంట రమేష్ శనిగరం అరుణ్,పుష్ప, చుక్క శ్రీనివాస్, రవి, జగన్ ,నైతం సాయికృష్ణ, రాఘవ, లావణ్య, శ్రీలత, పావని మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.