19-11-2025 07:26:38 AM
-ఎస్ఐ బండి మోహన్ బాబు
హుజూర్ నగర్: డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్ఐ బండి మోహన్ బాబు అన్నారు. మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీను అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ...విద్యార్థులు తమ నైపుణ్యాలలో ప్రతిభ చూపించి ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయాలన్నారు.డ్రగ్స్,అల్కహాలకు విద్యార్థి దశలో బానిసలు అయితే జీవితం నాశనం అవుతుందన్నారు. అనంతరం విద్యార్థులతో డ్రగ్స్ రహిత సమాజ స్థాపనలో తమ వంతు పాత్ర పోషిస్తామని విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ బలరాంరెడ్డి,అద్యాపకులు బ్రహ్మచారి,శ్రీనివాసరెడ్డి, నరసింహారావు,నాగుల్ మీరా, రమణారెడ్డి,సూరారెడ్డి శోభారాణి ఉపేంద్ర,అరుణ్ జ్యోతి, అధ్యాపకేతర సిబ్బంది, పాల్గొన్నారు.