calender_icon.png 19 November, 2025 | 2:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇక వాట్సాప్‌తోనే ‘మీ సేవ’

19-11-2025 01:02:50 AM

  1. ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వ సేవలు
  2. ‘మీ సేవ సర్వీసెస్ ఆన్ వాట్సాప్’ ప్రారంభం
  3.   38 ప్రభుత్వ విభాగాలకు చెందిన 580కి పైగా పౌర సేవలు ఇక వాట్సాప్‌లో..
  4. టెక్నాలజీని సమానత్వ సాధనంగా చూస్తున్నాం
  5. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 18 (విజయక్రాంతి): ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటకే తీసుకువచ్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో విప్లవాత్మక అడుగు వేసింది. అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్ వేదికగా ‘మీ సేవ’ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మంగళవారం బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణా హోటల్‌లో మెటా, మీ సేవ సంయుక్త భాగస్వామ్యంలో రూపొందించిన ఈ ప్రతిష్ఠాత్మక సేవలను లాంఛనంగా ప్రారంభి ంచారు.

పీపుల్ సెంట్రిక్ డిజిటల్ గవర్నెన్స్‌లో తెలంగాణను దేశానికే రోల్ మోడ ల్‌గా మార్చాలన్నదే తమ సంకల్పమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ‘ఇతర రాష్ట్రాలు తెలంగాణను అనుసరించేలా 38 ప్రభుత్వ విభాగాలకు చెందిన 580కి పైగా పౌర సేవలను వాట్సాప్ ద్వారా ప్రజలకు తెచ్చాం. జెన్ ఏఐ, మొబైల్ ఫస్ట్ అప్రో ద్వారా పౌర సేవల ముఖచిత్రాన్ని మార్చిన ఘనత తెలంగాణకే దక్కింది’ 

గవర్నెన్స్ అంటే కేవలం నాలుగు గోడల మధ్య కూర్చుని పాలించడం కాదు. ప్రజలను పాలనలో భాగస్వాములను చేస్తూ, టెక్నాలజీ సాయంతో పౌర సేవలను వారి ముంగిటకే చేర్చడమే నిజమైన గుడ్ గవర్నెన్స్. మా ప్రభుత్వం టెక్నాలజీని కేవలం ఒక సాఫ్ట్‌వేర్‌గా చూడటం లేదు, దానిని ఒక సమానత్వ సాధనంగా చూస్తోంది. టెక్నాలజీ ఫలాలను రాష్ర్టంలోని మారుమూల ప్రాంతంలో ఉన్న చివరి వ్యక్తి వరకు చేర్చడమే మా లక్ష్యం’ అని అన్నారు.

గత బీఆ ర్‌ఎస్ ప్రభుత్వం రాచరిక పోకడలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని ఆయన విమర్శించారు. దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి తెచ్చిన ఏఐ ఆధారిత తెలంగాణ డిజిటల్ ఎక్స్ఛేంజ్, ఏఐ సిటీ, ఏఐ యూనివర్సిటీ, తెలంగాణ ఇన్నోవేషన్ హబ్ తో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో తెలంగాణ ఒక బెంమార్క్‌ను సెట్ చేస్తోందని మంత్రి తెలిపారు. ఏటా 10 లక్షల మంది తెలంగాణ యువతను ఏఐ నిపుణులుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

త్వరలోనే ఈ సేవలను తెలుగు, ఉర్దూ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఇతర ప్రభుత్వ విభాగాలకు కూడా ఈ వాట్సాప్ సేవలను విస్తరిస్తామన్నారు. టైప్ చేయాల్సిన అవసరం లేకుండా, కేవలం వాయిస్ కమాండ్‌తోనే సేవలను పొందేలా సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, మీ సేవ కమిషనర్ రవి కిరణ్, మెటా ప్రతినిధి నటాషా పాల్గొన్నారు.