calender_icon.png 19 November, 2025 | 2:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనావాసాల్లోకి మావోయిస్టులు ఏపీ హైఅలర్ట్

19-11-2025 12:45:28 AM

51 మంది అరెస్ట్

  1. నేడు పుట్టపర్తిలో సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు ప్రధాని మోదీ 
  2. ఎల్లుండి తిరుమలేశుని దర్శించుకోనున్న రాష్ట్రపతి ముర్ము
  3. హిడ్మా డైరీలోని వివరాల ఆధారంగా రంగంలోకి భద్రతా దళాలు 
  4. ఐదు జిల్లాల్లో ఆక్టోపస్, ఇంటెలిజెన్స్ జాయింట్ ఆపరేషన్
  5. కృష్ణా జిల్లాలో అదుపులోకి 33 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు 
  6. వీరిలో తొమ్మిది మంది పార్టీ చీఫ్ తిరుపతి సెంట్రీలు
  7. ఏలూరు జిల్లా కేంద్రంలో అదుపులోకి 15 మంది పార్టీ సభ్యులు 
  8. వీరిలో 11 మంది హిడ్మా అనుచరులు, పీఎల్జీఏ సభ్యులు

అమరావతి, నవంబర్ 18: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లోని జనావాసాల్లో మావోయి స్టులు ఆశ్రయం పొందడం కలకలం రేపింది. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం అటవీప్రాంతం మారేడుమిల్లి ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ మాస్టర్ మైండ్ హిడ్మా మృతిచెందాడు. హిడ్మా వద్ద ఉన్న డైరీలో లభిం చిన ఆధారంతో ఇంటెలిజెన్స్, ఆక్టోపస్ బృందాలు మంగళవారం ఉదయం చేపట్టిన జాయింట్ ఆపరేషన్‌లో 51 మంది మావోయిస్టులు పట్టుబడ్డారు.

పట్టుబడిన వారిలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, పార్టీ సుప్రీం కమాండర్, పార్టీ జాతీయ కార్యదర్శి తిప్పర్తి తిరు పతి అలియాస్ దేవ్‌జీ సెంట్రీలు, అనుచరులు ఉండటం.. ఏకంగా మూడు డంప్ లు పట్టుబడటం.. అక్కడి పోలీస్ వర్గాలను అలెర్ట్ చేసింది. శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలో బుధవారం ప్రధా ని మోదీ పర్యటన ఖరారైంది. పుట్టపర్తి సాయిబాబా శత జయంత్యుత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు.

అలాగే ఈనెల 21వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. మర్నాడు 22న రాష్ట్రపతి పుట్టపర్తికి చేరుకుని సాయిబాబా శత జయంత్యుత్సవాలకు హాజరుకానున్నారు. రాష్ట్రపతి, ప్రధాని పర్యటనలు ఖరారైన సందర్భంలో ఇంతపెద్ద ఎత్తున మావోయిస్టు పార్టీ సభ్యులు పట్టుబడటంతో ఏపీ ప్రభుత్వం ఉలిక్కిపడింది.

అదుపులోకి 33 మంది

విజయవాడ నగర శివారు కొత్త ఆటోనగర్‌తోపాటు (ఉమ్మడి కృష్ణా జిల్లా) పలుచోట్ల ఇంటెలిజెన్స్, ఆక్టోపస్ బృందా లు 33 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశాయి. మూడు చోట్ల డంప్‌లను స్వాధీనం చేసుకున్నాయి. పట్టుబడిన వారిలో మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్, పార్టీ జాతీయ కార్యదర్శి తిప్పర్తి తిరుపతి అలియాస్ దేవ్‌జీ సెంట్రీలు, టీం సభ్యులు తొమ్మిది మంది ఉన్నారు. పట్టుబడిన వారిలో ఎక్కువ మంది ఛత్తీస్‌గఢ్, ఒడిశాకు చెందిన వారు. వీరంతా కొత్త ఆటోనగర్‌లోని ఓ భవనాన్ని షెల్టర్‌గా చేసుకుని ఉంటున్నారు.

వీరిలో 12 మంది మహిళలు. మిగిలిన వారు మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో కొనసాగు తున్న సభ్యులు ఉన్నారు. మిగతావారు సానుభూతిపరులు, మిలీషియా సభ్యులు. మావోయిస్టులు షెల్టర్ చేసుకున్న భవన యజమాని కోసం పోలీసులు ఆరా తీయగా, అతడు నెలన్నర నుంచి విదేశాల్లో ఉంటున్నట్లు తెలిసింది. మావోయిస్టులు పదిరో జుల క్రితం  ఈ ప్రాంతానికి వచ్చి ఆశ్రయం వచ్చారని, కూలీ పనుల కోసం విజయవాడ వచ్చామంటూ, అద్దెకు ఉంటామని యాజమానిని నమ్మించినట్లు సమాచారం. 

గోదావరి జిల్లాల్లో 18 మంది అరెస్ట్

‘గోదావరి’ జిల్లాల పరిధిలోని ఏలూరు గ్రీన్‌సిటీ గేటెడ్ కమ్యూనిటీలోని భద్రత బలగాలు, పోలీసులు 15 మంది మావోయి స్టులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నలుగురు మావోయిస్టు పార్టీ మాస్టర్ మైండ్ పీఎల్‌జీఏ బెటాలియన్‌కు చెందిన 11 మంది సభ్యులు అని, మిగిలిన నలుగురు మహిళా మావోయిస్టులు. ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో పెద్ద ఎత్తున పోలీసు బృందాలు పాల్గొన్నాయి.

పట్టుబడిన వారంతా ఒడిశాకు చెందిన వారని తెలిసింది. వీరంతా వారం నుంచి ఏలూరులో తలదాచుకున్నట్టు తెలిసింది. మావోయిస్టులు ఈ ప్రాంతాన్ని ఎందుకు షెల్టర్ జోన్‌గా ఎందుకు ఎంచుకున్నారు? ఇక్కడ ఎందరు మావోయిస్టు సాను భూతి పరులు ఉన్నారు? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. భవన యజమాని నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అలాగే కాకినాడలో ఇద్దరు మావో యిస్టు పార్టీ సభ్యులు, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక మావోయిస్టు సభ్యుడిని అదుపులోకి తీసుకున్నారు.

మూడు డంప్‌లు గుర్తించాం

  1. మిగిలిన మావోయిస్టుల కోసం గాలింపు
  2. ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్ చంద్ర లడ్డా 

అక్టోపస్, ఇంటెలిజెన్స్ సంయుక్తంగా చేపట్టిన జాయింట్ ఆపరేషన్‌లో మొత్తం మూడు మావోయిస్టు పార్టీ డంప్‌లను గుర్తిం చామని ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్ చంద్ర లడ్డా స్పష్టం చేశా రు. ఏపీ రాజధాని అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయనమా మాట్లాడారు. డంప్‌లో రెండు ఏకే-47, ఒక పిస్టల్, ఒక రివాల్వర్, ఒక రివాల్వర్, ఒక సింగిల్ బోర్ ఆయుధం, 1,525 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు, 150 నాన్ ఎలక్ట్రికల్ డిటోనేటర్లు, ఒక ఎలక్ట్రికల్ వైర్ బండిల్, ఒక కెమెరా ఫ్లాష్ లైట్ , ఒక కటింగ్ బ్లేడ్, ఫ్యూజ్ వైర్ పెట్టె, ఏడు కిట్ బ్యాగులు  స్వాధీనం చేసుకున్నారు.

ఛత్తీస్‌గఢ్, ఒడిశాలో మావోయిస్టులకు ప్రతికూల పరిస్థి తులు ఉండటంతో వారం తా ఏపీలోని కొన్ని నగరాలు, పట్టణ ప్రాంతా లను షెల్టర్లుగా చేసుకుంటున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టుల కదలికలపై ఏపీ పోలీసులు నిఘా ఉంచారని, రాష్ట్రంలోకి మావోయిస్టులు ప్రవేశిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహిం చామని స్పష్టంచేశారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. కాగా, బుధవారం పూర్తి వివరాలను మీడియాకు వెల్లడిస్తామని ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ తెలిపారు. సమావేశంలో కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పాల్గొన్నారు.