19-11-2025 12:55:26 AM
హిడ్మా భార్య రాజే, మరి నలుగురు మావోయిస్టులు మృతి
హైదరాబాద్, నవంబర్ 18 (విజయక్రాంతి) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామారాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో మంగళవారం ఉదయం జరిగిన ఎదురు కాల్పుల్లో సీనియర్ మావోయిస్టు నేత మడావి హిడ్మా మరణంతో దండకారణ్యం మావోయిస్టు ఉద్యమంలో ఒక కీలక ఘట్టం ముగిసింది. దశాబ్ద కాలంగా ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో వేలాది మంది భద్రతా బలగాల మరణాలకు కారకుడు, మావోయిస్టు పార్టీలో అత్యంత వ్యూహాత్మక దాడుల రూపకర్త హిడ్మా మరణాన్ని అధికారులు ధ్రువీకరించారు.
ఆయనపై రూ. కోటి రివార్డు ఉంది. మంగళవారం ఉద యం ౬ నుంచి ౭ గంటల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిడ్మా భార్య రాజే, అనుచరులు మల్లా, దేవే, చెల్లూరి నారాయణ అలియాస్ సురేశ్, టెక్ శంకర్ ఉన్నారు. హిడ్మా వయస్సు 5౦ ఏళ్లపైనే. ‘ఆపరేషన్ కగార్’ తీవ్రతరం కావడంతో హిడ్మా టీమ్ ఛత్తీస్‌గఢ్ నుంచి మారేడుమిల్లి వైపు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. మావో యిస్టుల కదలికలపై సమాచారం అందడం తో ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు కూం బింగ్ చేపట్టాయి.
ఈ నేపథ్యంలో ఇరువ ర్గాల మధ్య కాల్పలు చోటుచేసుకున్నాయి. మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మావోయిస్టుల మృతదేహాలను తీసుకొచ్చిన నేపథ్యంలో మార్చురీ వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి ఆ ప్రాంతంలో భద్రతా బ లగాల కూంబింగ్ కొనసాగుతున్నట్లు ఏపీ డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా తెలిపారు.
ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాం తాల్లో మావోయిస్టుల కదలికలపై సమా చారం నేపథ్యంలో కూంబింగ్ నిర్వహించి నట్లు చెప్పారు. నవంబర్ 30లోపు హిడ్మా ఆటకట్టించాలని భద్రతా బలగాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించినట్లు సమాచారం. ‘2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని నిర్మూలించాలని అమిత్ షా గడువు విధించారు.
ఈ క్రమంలో జరిగిన భద్రతా సమీక్షా సమావేశంలో నవంబర్ 30లోగా హిడ్మా పనిపట్టాలని భద్రతా బల గాలకు ఆదేశాలు ఇచ్చారు. అయితే ఆ డెడ్ లైన్ కన్నా ముందుగానే ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో హిడ్మా మృతిచెందడం గమనార్హం.’ అని పోలీసు వర్గాలు పేర్కొ న్నాయి. ప్రస్తుతం జరుగుతోన్న ఆపరేషన్లను చూస్తుంటే.. మార్చి కంటే ముందుగానే నక్స లిజం తుడిచిపెట్టుకుపోతుందని ఆ వర్గాలు అంచనావేశాయి.
కర్రెగుట్టల దాడితో ఆంధ్రాకు వచ్చి..
హిడ్మా కోసం కొన్నేళ్లుగా ఛత్తీస్‌గఢ్ పోలీ సులతోపాటు సీఆర్పీఎఫ్ కోబ్రా బలగాలు, తెలంగాణ గ్రేహౌండ్స్ బలగాలు విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమం లోనే ఈ ఏడాది జనవరిలో కర్రెగుట్టల నుంచి మొదలుకొని అబూజ్‌మడ్ పర్వతాల తోపాటు నేషనల్ పార్కులో భద్రతా దళాలు అణువణువూ జల్లెడ పట్టాయి. దండకా రణ్యంలో వేలాదిగా సాయుధ బలగాలు కూంబింగ్ నిర్వహించగా.. అనేకమంది మా వోయిస్టు అగ్రనేతలు వరుసగా ప్రాణాలు కోల్పోయారు.
అప్పుడు హిడ్మా కూడా తన బెటాలియన్‌తో కలిసి నేషనల్ పార్క్లోనే ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానించాయి. ఆ సమయంలో అతడి తాజా ఫొటో ఒకటి బయటకు రావడం తీవ్ర చర్చనీయాంశ మైంది. అయితే, జనవరిలో భద్రతా బలగా లు తన స్థావరాన్ని చుట్టుముట్టడానికి కొన్ని గంటల ముందే హిడ్మా అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత సమీపంలోని ఓ కొండల ప్రాం తంలో నక్కినట్లు తెలిసింది.
ఓ సమయంలో హిడ్మా లొంగిపోనున్నాడనే ప్రచారం కూడా జరిగింది. భద్రతా బలగాల కూంబింగ్ నిరంతరం కొనసాగుతుండటంతో హిడ్మా బృందం.. ఛత్తీస్‌గఢ్ నుంచి మకాం మా ర్చేందుకు ఆంధ్రా సరిహద్దులను పరిశీలిం చినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. మారేడుమిల్లి సరిహద్దు మీదుగా వీరు ఆంధ్రాలోకి ప్రవేశించారని, అక్కడి నుంచి ఒడిశా వెళ్లేందుకు ప్రయత్నించినట్లు పేర్కొ న్నాయి. వీరి కదలికలపై సమాచారం అందడటంతో భద్రతా బలగాలు తాజా ఆపరేషన్‌ను చేపట్టాయి.
సుక్మా జిల్లాలో..
మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లోని సు క్మా జిల్లాలోనూ మంగళవారం ఎదురుకాల్పులు జరిగాయి. ఎర్ర బోరు ప్రాంతంలో మావోయిస్టు లు, -భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. ఆ ప్రాంతంలో ఎదురుకా ల్పులు కొనసా గుతున్నట్లు పోలీసు లు తెలిపారు.