calender_icon.png 13 November, 2025 | 7:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసులపై తప్పుడు ప్రచారం చేయవద్దు

13-11-2025 06:10:38 PM

నిర్మల్ (విజయక్రాంతి): బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు దిగంబర్ కాంబ్లీను అదుపులో తీసుకునే విషయంలో న్యాయవాదులపై పోలీసులు దాడి చేశారని ఆరోపించడం సరికాదని పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. న్యాయవాదులు పోలీసులు రౌడీలుగా వివరిస్తున్నారని తమ పైన దురుసుగా ప్రవర్తించారని అందుకు సంబంధించిన వీడియోలు తమ వద్ద ఉన్నాయని ఆయన తెలిపారు. అక్కడ జరిగిన విషయాలను ఆయన వెల్లడించారు. 

సభ్య సమాజం తలదించుకునేలా తన మిత్రుడి కూతురు అయిన 14 సంవత్సరాల మైనర్ SC బాలికను(డిప్రెషన్ లో ఉన్న బాలిక) లైంగికంగా వేధించినట్లు బాలిక, అతని తండ్రి కేసు పెట్టడంతో, తప్పించుకొని తిరుగుతున్న దిగంబర్ కాంబ్లె అనే నేరస్తుడిని నిన్న ఉదయం ఐబీ గెస్ట్ హౌస్ అవతలి వైపు, కోర్టుకి బయట ఆవరణంలో కారులో ఉండగా, పోలీసులు నేరస్తుడిని గమనించి తమతో రావాలని మర్యాదపూర్వకంగా కోరగా అతను ప్రతిఘటించడంతో పాటు కార్ లోంచి దిగకుండా పోలీసులను ఇబ్బంది పెట్టడంతో పోలీస్ వారు కారుకు ఎటువంటి డ్యామేజ్ చెయ్యకుండా డోర్ ఓపెన్ చేసి దిగంబర్ కాంబ్లె అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది.

ఇటువంటి తీవ్ర నేరం చేసిన వ్యక్తిని కస్టడీ లోకి తీసుకునే క్రమంలో న్యాయవాదులే పోలీసు వారి విధులను అడ్డుకుంటూ నేరస్తుడని తెలిసి కూడా అతనిని సహకరిస్తూ, అదుపులోకి తీసుకుందాం అని వచ్చిన పోలీసు వారిని అసభ్యకరంగా బూతు మాటలు తిట్టారు. ఇట్టి వ్యక్తిని కోర్టు లోపలి నుండి లాక్కుని వెళ్లినట్లు దుష్ప్రచారం చేస్తూ, ప్రెస్ మీట్లు పెడ్తు, విధులు బహిస్కరిస్తాం అని బెదిరింపులకు పాల్పడ్డారు.