13-11-2025 05:34:45 PM
ముకరంపుర (విజయక్రాంతి): బీసీ జేఏసీ నాయకులు దొగ్గలి శ్రీధర్ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ వద్ద ధర్మ పోరాట దీక్ష నిర్వహించారు. ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్, ఆది మల్లేశం హాజరై మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ఈ ధర్మదీక్ష పోరాట దీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో 42% రిజర్వేషన్లు పెంచడానికి పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేసి తొమ్మిదవ షెడ్యూల్ చేర్చాలని డిమాండ్ చేశారు.
ఈనెల 16న రన్ ఫర్ సోషల్ జస్టిస్, 18న ఎంపీలతో ములక్కాత్, 23న అఖిలపక్ష సమావేశాలు నిర్వహిస్తున్నామని, డిసెంబర్ మొదటి వారంలో ఢిల్లీలో పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ దీక్షకు తెలంగాణ జాగృతి అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు జిఎస్ ఆనంద్, దేవరకొండ సంతోషి లక్ష్మి, మంతెన కిరణ్, వాయిల రాజ్ కుమార్, గుమ్మడి శ్రీనివాస్, ఆశిష్ గౌడ్, బియ్యని తిరుపతి, రవీంద్ర చారి, రామ్మూర్తి, నితిన్, తదితరులు పాల్గొన్నారు.