13-11-2025 05:48:52 PM
నిర్మల్ (విజయక్రాంతి): పట్టణంలోని బంగల్పేట మహాలక్ష్మి ఆలయంలో బుధవారం రాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఆలయం కున్న గేట్లను పగలగొట్టి లోపల ఉన్న రెండు హుండీలను ధ్వంసం చేసి అందులో ఉన్న నగదును దొంగిలించినట్టు పోలీసులు తెలిపారు. గురువారం ఉదయం గుడికి వెళ్లిన ఆలయ పూజారి ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు క్లూస్ టీం తో వచ్చి దర్యాప్తు చేస్తున్నారు.