calender_icon.png 13 November, 2025 | 7:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జోనల్ స్థాయి క్రీడ పోటీలు విద్యార్థుల ప్రతిభ

13-11-2025 05:32:38 PM

నిర్మల్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లో నిర్వహించిన గిరిజన ఆశ్రమ పాఠశాలల జోనల్ స్థాయి పోటీలో నిర్మల్ జిల్లాకు చెందిన విద్యార్థులు ప్రతిభ సాధించినట్లు పిఈటి ముఖ్య రమేష్ తెలిపారు. కబడి వాలీబాల్ చెస్ అథ్లెటిక్ తదితర పోటీల్లో జిల్లాలోని వివిధ ఆశ్రమ గిరిజన పాఠశాలకు చెందిన 50 మంది విద్యార్థులు ఛాంపియన్షిప్లు దక్కించుకున్నారని తెలిపారు. ప్రతిభ సాధించిన విద్యార్థులకు జిల్లా గిరిజన సంక్షేమ అభివృద్ధి అధికారి డిడి అంబాజీ నాయక్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు ఉన్నారు.