13-11-2025 06:04:02 PM
మండల తహసిల్దార్ సతీష్ కుమార్
మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో అసైన్డ్ భూముల్లో కొంతమంది ఫ్లాట్లు చేసి అమ్మకాలు జరుపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ప్రజలు అనుమతి లేని ఫ్లాట్లను కొనుగోలు చేసి ఆర్థికంగా నష్టపోవద్దని మండల తహసిల్దార్ పీ సతీష్ కుమార్ కోరారు. మండల కేంద్రం లోని తహసిల్దార్ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అసైన్డ్ భూములను కొంతమంది అన్యాక్రాంతంగా వెంచర్లు చేస్తున్నారనీ ఫిర్యాదులు అందాయని, వాటిపై సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ అనుమతులు లేని ప్లాట్లను కొనుగోలు చేయవద్దని ప్రజలను కోరారు. ప్రభుత్వ భూములలో ఎవరైనా ఆక్రమించి అక్రమంగా వెంచర్లు చేసి ప్లాట్లుగా మార్చి క్రయ విక్రయాలు చేపడితే చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రజలు ఫ్లాట్లు కొనుగోలు సమయంలో పూర్తి వివరాలు పరిశీలించిన తర్వాతనే కొనుగోలు చేయాలని ఆయన కోరారు.