calender_icon.png 13 November, 2025 | 7:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిజిటల్ లిటరసీపై అవగాహన కలిగి ఉండాలి

13-11-2025 06:06:26 PM

జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి, ఉప్పులేటి శ్రీనివాస్..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): విద్యార్థుల్లో కృత్రిమ మేధ, సాంకేతిక నైపుణ్యం, డిజిటల్ లిటరసీ మీద అవగాహన కల్పించాల్సిన పూర్తి బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉన్నదని, ప్రతి ఉపాధ్యాయుడు ఆధునిక బోధన పద్ధతులు ఉపయోగించి, డిజిటల్ టూల్స్ ద్వారా విద్యా బోధన చేసి విద్యార్థుల్లో విజయగాహన, శాస్త్ర సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించాలని తెలంగాణ మోడల్ స్కూల్ ఆసిఫాబాద్ లో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఆసిఫాబాద్ డివిజన్ లోని వివిధ పాఠశాలల గణిత, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు.

గణితములో కోడింగ్, డేటా సైన్స్, భౌతిక శాస్త్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిజికల్ కంప్యూటింగ్ అంశాలు విద్యార్థులకు బోధించాలని ఈ అంశాలకు సంబంధించి ఈ మూడు రోజుల శిక్షణను ఉపాధ్యాయులందరూ సద్వినియోగపరచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ లు శ్యాంసుందర్, శ్రీనాథ్,రవికుమార్, రాజనర్సు బాబు, పాఠశాల ప్రిన్సిపల్ మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.