calender_icon.png 22 January, 2026 | 6:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మవారికి చలి బోనాలు

09-02-2025 06:57:35 PM

దస్తూరాబాద్ (విజయక్రాంతి): చలికాలం ముగింపు సమయంలో మాఘమాసంలో గ్రామ దేవతలకు బోనాలను సమర్పిచడం ఆనవాయితీగా వస్తుంది. కాగా ఆదివారం మండల కేంద్రంలోని పోచమ్మ ఆలయల్లో పాటు, మండలంలో గ్రామాల్లోని పోచమ్మ ఆలయాల్లో ఆదివారం మహిళలు అమ్మవార్లకు చలి బోనాలను సమర్పించారు. భక్తి శ్రద్ధలతో ఉండి ఒక్క రోజు ముందుగానే బోనాలను తయారు చేసి, ఉదయమే బోనాలను నెత్తిన ఎత్తుకొని అందరూ కలిసి పోచమ్మ ఆలయాలకు చేరుకున్నారు. బోనాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు.